ఆధార్లో సబ్సిడీ ఉల్లి
- హైదరాబాద్ : ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో తెలంగాణ సర్కారు ఇస్తున్న సబ్సిడీ ఉల్లిపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నగరంలోని రైతుబజారుల్లో ప్రారంభించిన సబ్సిడీ ఉల్లి కేంద్రాలకు భారీ స్పందన లభిస్తోంది. ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో అందరికీ అందేలా ఆధార్ కారును నమోదు చేసుకుని రూ.40కి కిలో చొప్పున రోజుకు వెయ్యి కిలోలు విక్రయిస్తున్నారు. అయిత ఆంజు సాయంత్రం 4 గంటల నుంచి గంటల ఎంకు విక్రయ కేంద్రాలు పని చేస్తున్నాయి. స్థలిపురం రైతుబజార్లో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఉల్లి కొనుగోలుకు ఇక్కడికి వస్తున్నారు. దీంతో రోజుకు సగటున పది క్వింటాళ్ల వరకు విక్రయిస్తున్నట్లు రైతు బజార్ సిబ్బంది తెలిపారు. మార్కెట్లో భారీగా పెరిగిన ఉల్లి ధరకు కళ్లెం వేయడంతోపాటు, సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రా లను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డ రూ.80నుంచి 100కు అమ్ముతున్నారు. సబ్సిడీపై రైతుబజార్‌లో రూ.40కి కిలో చొప్పున అందిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు విక్రయ కేంద్రం పనిచేస్తుంది. కేంద్రాన్ని ప్రారంభించి ఐదురోజులు అవుతుండగా ఇప్పటికే 50 క్వింటాళ్లు ఉల్లిని సరఫరా చేశారు. కుటుంబానికి ఒక్క కిలో చొప్పున తీసుకోవాలని వ్యాపారస్తులకు విక్రయించేది లేదని తెలిపారు. కాగా ధరలు పెరిగినపుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.